Nandyala: గేట్ పరీక్షలో అద్భుతమైన ర్యాంక్.. ఈ యువకుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

by Disha Web Desk 16 |
Nandyala: గేట్ పరీక్షలో అద్భుతమైన ర్యాంక్.. ఈ యువకుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
X

దిశ, అవుకు: ఈనెల ఫిబ్రవరి 4న నిర్వహించిన గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకుకి చెందిన సాత్రి ప్రమోద్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫలితాల్లో 384 ర్యాంకు సాధించారు. ప్రమోద్ కుమార్ తండ్రి సాత్రి రామయ్య ఓ ప్రముఖ చానల్లో పనిచేస్తున్నారు. సాత్రి రామయ్య అనురాధ దంపతులకు ఇద్దరు కుమారుల సంతానం. వీరిలో ద్వితీయ కుమారుడు ప్రమోద్ కుమార్. ఇతను ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివరారు. పదవ తరగతిలో ప్రమోద్ 93.8% ఉత్తీర్ణత సాధించారు. ట్రిపుల్ ఐటీ బాసరలో బీటెక్ సీఎస్పీ 92.4% మార్కులు సాధించారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన గేట్ పరీక్షల్లో 8 లక్షల మంది హాజరు కాగా అవుకుకు చెందిన ఈ యువకుడు అరుదైన ర్యాంక్ సాధించారు. తమ కుమారుడు ర్యాంకు సాధించాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి, గూడాల సోదరులు, పలువురు ప్రముఖ నాయకులు ఫోన్‌లో ప్రమోద్ కుమార్‌ను అభినందించారు.



Next Story