Srisalam Temple: భారీగా కన్నడ భక్తుల రద్దీ

by Disha Web Desk 16 |
Srisalam Temple: భారీగా కన్నడ భక్తుల రద్దీ
X

దిశ, శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కన్నడ భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెద్ద సంఖ్యలో పాదయాత్రగా వస్తున్నారు. ఎండలు సైతం లెక్కచేయకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు నల్లమల్ల అడవుల గుండా కాలి నడకన వస్తున్నారు. బేలూటీ, నగులూటీ, భీముని కొలను మీదుగా నల్లమల కొండల్లో కఠోరమైన కాలి నడక సాగిస్తున్నారు. మార్గమధ్య అడవుల్లోనే భక్తులు సేద తీరుతున్నారు. కైలాస ద్వారం, హటకేశ్వరం, సాక్షి గణపతి వద్ద భక్తులకు అన్నదానం, అల్పాహారం అందజేస్తున్నారు. కన్నడ యువకులు కాళ్లకు చక్కలు కట్టుకుని కాలినడకన వస్తూ ఆకట్టుకుంటున్నారు. దర్శనం ముగిసిన తరువాత భక్తులు తమ ప్రాంతాలకు తిరుగుముఖం పడుతున్నారు. శనివారం నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో కన్నడ భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది.

Next Story