Dhone: ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

by Disha Web Desk 16 |
Dhone: ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
X

దిశ, డోన్: డోన్ పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్పూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో డోన్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పాత బస్టాండ్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది ఆకలి తీర్చారు. తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు సురేంద్ర గౌడ్, కలచట్ల చంద్రశేఖర్, సీసంగుంతల రంగారెడ్డి, మంగలి నగేష్ తెలిపారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది ఆకలి తీర్చిన ఎన్టీఆర్ అభిమానులను పలువురు స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు, స్పూర్తి సభ్యులు పాల్గొన్నారు.


Next Story