ఆమె జన్మించి 67 ఏళ్లు.. కానీ వయసు మాత్రం 6 సంవత్సరాలే..!

by Dishanational2 |
ఆమె జన్మించి 67 ఏళ్లు.. కానీ వయసు మాత్రం 6 సంవత్సరాలే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమె జన్మించి 67 ఏళ్లు అవుతుంది. వృద్ధాప్యంలో ఉన్న ఆమె పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది.అయితే వృద్ధురాలి అప్లికేషన్‌ను పరిశీలించిన అధికారులు ఆమెకు షాక్ ఇచ్చారు. ''నీ వయసు కేవలం ఆరేళ్లు మాత్రమేనని.. పింఛన్ ఇవ్వడం కుదరదని'' తేల్చి చెప్పారు. 67 ఏళ్లు ఉన్న వృద్ధురాలి వయసు ఆరేళ్లకు ఎలా తగ్గిందో మీరే చూడండి.

ఎన్టీఆర్ జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన నాంచారమ్మ నిరుపేద వృద్ధురాలు. ఆమె భర్త చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. వితంతు పింఛన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంది. అయితే హౌస్‌హోల్డ్ సర్వేలో నాంచారమ్మ వయస్సు కేవలం ఆరేళ్లు(6)గా నమోదు చేశారు. దీంతో పింఛన్ ఆగిపోయింది. హౌస్‌హోల్డ్ సర్వేలో సరిచేసుకునేందుకు, ఆధార్ ఈకేవైసీ చేసేందుకు ఆమె ఐరిస్, వేలిముద్రలు పడకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నా న్యాయం జరగలేదని వాపోతుంది. సర్వే నమోదులో నిర్లక్ష్యం కారణంగా వృద్ధురాలి వయస్సు తప్పుగా పడటంతో ఏడాదిన్నరగా పింఛన్ నిలిచిపోయింది. వేలిముద్రలు పడకపోయినా, వాలంటీర్‌లు రేషన్ ఇస్తున్నారని, హౌస్‌హోల్డ్ సర్వేలో వయస్సు కూడా మార్చండి అంటూ ఉన్నతాధికారులకు నాంచారమ్మ విజ్ఞప్తి చేసింది. వృద్ధురాలి సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని గ్రామ కార్యదర్శులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు చెబుతున్నారు.


Next Story

Most Viewed