పిఠాపురంలో మంగళవారం కీలక ఘట్టం

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-04-22 17:06:51  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో మంగళవారం నామినేషన్ వేస్తున్నారు. ...

పిఠాపురంలో మంగళవారం కీలక ఘట్టం
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో మంగళవారం నామినేషన్ వేస్తున్నారు. ఉదయం 9.గంటలకు గొల్లప్రోలు పట్టణం నుంచి పాదగయ క్షేత్రం వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఏంట్రీ నుంచి నామినేషన్ పత్రాలు సమర్పించే వరకూ కూడా ఆయన వెంటే ఉండాలని, భారీగా తరలిరావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. దీంతో పిఠాపురంలో మంగళవారం సందడి వాతావరణం నెలకొననుంది.

Next Story