- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ జనాన్ని భయపెట్టారు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
అమరావతి (Amaravati) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) చేతుల మీదుగా కూటమి సర్కార్ రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి (Amaravati) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) చేతుల మీదుగా కూటమి సర్కార్ రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. రాజధాని పరిధిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. హైకోర్టు (High Court), సెక్రటేరియట్, అసెంబ్లీ (Assembly) భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయ నిర్మాణాలకు ఇనాగ్యురేట్ చేశారు. అదేవిధంగా డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఐ, రైల్వేస్‌కు సంబంధించి రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు పూర్తి అయ్యాయి.
అయితే, అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోవానికి డుమ్మా కొట్టిన మాజీ సీఎం జగన్‌పై విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు (MLA Vishnu Kumar Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం (Pahelgam) ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఏకంగా రష్యా (Russia) పర్యటనను రద్దు చేసుకుని సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు ఇచ్చిన మాట మేరకు రాష్ట్రానికి ప్రధాని రావడం సంతోషకరమని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్న జగన్ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఆయన దురదృష్టమని సెటైర్లు వేశారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రజలను భయపెట్టారని కామెంట్ చేశారు. టిడ్కో (TIDCO) ఇళ్లు నిర్మిస్తే వాటిని కూడా ఎందుకు పనికిరాకుండా నాశనం చేశారని ఫైర్ అయ్యారు. అమరావతిని అభివృద్ధి చేయనీవ్వకుండా వైసీపీ (YCP) ఐదేళ్లు అడ్డం పడిందని ఆరోపించారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వడం లేదని అన్నారు. ఏపీకి ఇక తిరుగులేదని.. అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ ప్రధాని భరోసానిచ్చారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.






