తోడేళ్ల గుంపు సింహంతో తలపడినట్లు ఉండనుంది: పొత్తుపై విజయసాయిరెడ్డి

by Disha Web Desk 21 |
తోడేళ్ల గుంపు సింహంతో తలపడినట్లు ఉండనుంది: పొత్తుపై విజయసాయిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను కొన్ని పార్టీలు స్వాగతిస్తుంటే వైసీపీ మాత్రం సెటైర్లు వేస్తోంది. తాజాగా ఈ పొత్తుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ‘2024లో ఏపీలో జరిగే ఎన్నికలు టీడీపీ వర్సెస్ వైసీపీగా వుండనుంది. ఇది తోడేళ్ల గుంపు సింహంతో తలపడినట్లు వుండనుంది. అధికారం కోసం దురాశపడేవారికి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వారికి మధ్య ఈ ఎన్నిక జరగనుంది’ అని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాదు ‘యూ టర్న్ రాజకీయాలు వర్సెస్ విశ్వసనీయత, అస్థిరత వర్సెస్ స్థిరత్వం, అవకాశవాదం వర్సెస్ నిజాయితీ, కుల రాజకీయాలు వర్సెస్ ఐకమత్యం, క్రోనీ క్యాపిటలిసమ్ వర్సెస్ అందరి ప్రయోజనాలకు మద్య రాబోయే ఎన్నికల్లో పోటీ ఉండనుంది. మొత్తంగా చెప్పాలంటే అన్ని ప్రతిపక్షాల పార్టీలు వర్సెస్ ప్రజాపక్షాన నిలబడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య ఎన్నికలు జరగనున్నాయి’ అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా కుండబద్దలు కొట్టారు.

More News : పవన్ కల్యాణ్ సినిమాల్లోనే హీరో.. రాజకీయాల్లో జీరో: మంత్రి జోగి రమేష్ సెటైర్

Next Story

Most Viewed