మైలవరం వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లను: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

by Disha Web Desk 21 |
మైలవరం వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లను: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశానుసారం నడుచుకుంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో వంతెన ప ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే వసంత మీడియాతో మాట్లాడారు. సీఎంవో కార్యాలయం నుంచి పిలుపు రావడంతో తాను తాడేపల్లి వెళ్లినట్లు వివరించారు. ఈ భేటీలో నియోజకవర్గానికి సంబంధించిన నిధులు, పనులను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యంమత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి సంబంధింత పనులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. తమ భేటీలో రాజకీయ పరమైన విషయాలేవీ చర్చకు రాలేదని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో పంతం కోసం పనిచేసి దేవినేని ఉమా మహేశ్వరరావును ఓడించానని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ మైలవరం నియోజకవర్గం ప్రజలకు కుటుంబ సభ్యుడిగా ఉంటానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు.

సీటుపై ఎలాంటి అపోహలు లేవు

ఇకపోతే వైసీపీ అధిష్టానం నుంచి ఫోన్ రావడం వల్లే తాను తాడేపల్లిలో సీఎం జగన్‌తో భేటీ అయినట్లు వెల్లడించారు. మొదటినుంచి తాను రాజకీయాలకు దూరంగానే ఉన్నానని తెలిపారు. రాజకీయంగా సీఎం జగన్ తనకు అవకాశం కల్పించారని అన్నారు. గతంలో తనను ఓడించిన వ్యక్తిని ఓడించానని చెప్పుకొచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లో మైలవరం వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని...మైలవరం సీటుపై ఎటువంటి అపోహలు లేవు అని చెప్పుకొచ్చారు. తనను నమ్ముకున్న వ్యక్తులని వదిలి ఎక్కడికి వెళ్ళను అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు.



Next Story

Most Viewed