పానీ పూరీ టేస్ట్ చూసి పిచ్చోళ్లు అయిపోయిన ఆస్ట్రేలియన్స్.. నోరు ఊరుతుంది అంటూ ఎలా ఎగబడి తింటున్నారో చూడండి.. (వీడియో)

by Dishafeatures3 |
పానీ పూరీ టేస్ట్ చూసి పిచ్చోళ్లు అయిపోయిన ఆస్ట్రేలియన్స్.. నోరు ఊరుతుంది అంటూ ఎలా ఎగబడి తింటున్నారో చూడండి.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్: పానీ పూరీ అంటే చాలా మందికి మహా పిచ్చి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు అయితే ఆ బండి చూడగానే నోరు ఊరిపోతుంది. వెంటనే పరుగెత్తి తినేయాలని మనసు లాగుతుంది. 99% తినేస్తారు కూడా. ఈ స్ట్రీట్ స్నాక్ అంటే అంత ఇష్టం మరి. శుభ్రంగా చేయరు.. రోగాలు వస్తున్నాయి అని పరిశోధనలు చేసి చెప్పినా సరే డిమాండ్ ఏమాత్రం తగ్గదు. సీజన్ ఏదైనా బిజినెస్ అదే ఊపుతో కొనసాగుతుంది. ఈజీగా లాభాల బాటలో పరుగెడుతుంది.

అయితే ఈ ఇండియన్ స్నాక్ ను మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియాలో తయారుచేసి జడ్జెస్ కు చూపించింది ఇండియాకు చెందిన మహిళ. ఈ టేస్ట్ చూసిన వాళ్లు దెబ్బకు ఫిదా అయిపోయారు. టైటిల్ చేతిలో పెట్టేసేంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. మొత్తానికి ఈ గోల్ గప్ప టేస్ట్ తో మళ్లీ మళ్లీ తినాలని ఉవ్విళ్లు ఊరిపోయారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్(Viral) కాగా.. 'అక్కడ ఈ పానీ పూరీ ఇంట్రడ్యూస్ చేస్తే రేట్ ఎక్కువ అయిపోతుంది.. అలా చేయకండి', ' వాటర్ కప్స్ అని అమ్ముతారేమో అక్కడ ', ' వావ్ వాట్ ఏ థాట్.. ఆ షోలో ఈ ఐటెం పరిచయం చేయడం నిజంగా మంచి ఆలోచన ' అని కామెంట్స్ పెట్టారు నెటిజన్లు.


Next Story

Most Viewed