Temple land dispute: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. పరస్పరం తీవ్ర ఆరోపణలు

by Disha Web Desk 16 |
Temple land dispute: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. పరస్పరం తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా పరిస్థితి మారింది. సాక్షీ భావన్నారయణ స్వామి భూములకు సంబంధించి ఇద్దరి మధ్య నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పొన్నూరుకు అతి సమీపంలో ఉండే ఈ ఆలయ భూములను ఆలయ ట్రస్టు బోర్డు ఆటో నగర్ కు కేటాయిస్తూ తీర్మానం చేసింది. దీంతో ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై ఆలయ భూముల్లో అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కిలారి రోశయ్య సాక్షీ భావన్నారయణ స్వామి గుడిలో ప్రమాణం చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.

అయితే అంతటితో ఆ వివాదం ఆగడంలేదు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉండి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పొన్నూరుకు ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ధూళిపాళ్ల పాడి రైతుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆలయ భూమిలో ధూళిపాళ్ల తండ్రి పేరుతో కాలనీ చేశారని చెప్పారు. 870 ఎకరాలను 270 ఎకరాలకు తీసుకొచ్చారని మండిపడ్డారు. భూమి లేకనే ఆటోనగర్ ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. భూమి విభజిస్తూ దేవాదాయశాఖనే ప్రతిపాదించిందని చెప్పారు. ఆరోపణలు మానకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

అయితే ఇందుకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. కలియుగ హరిశ్చంద్రుడు కిలారి రోశయ్య అని సెటైర్లు వేశారు. ఆటో నగర్ కోసం చేసిన తీర్మానాన్ని విభజించారని ఆయన ఆరోపించారు. షాపింగ్ కాంప్లెక్స్ కోసం జీవో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఒకే నెంబర్ పై రెండు ఆర్డర్లు ఎందుకు వచ్చాయని నిలదీశారు. మోసం చేసి కాంప్లెక్స్ కోసం తీర్మానం చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు.



Next Story