Ap News: ముందస్తు ఎన్నికలపై కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Ap News: ముందస్తు ఎన్నికలపై కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో నవంబర్ నెలలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పోరాటానికి సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరు టీడీపీ మినీమహానాడులో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో రాక్షస క్రీడ పేరుతో ఇళ్ల స్థలాలను ఇవ్వడమే జగన్ నేర చరిత్రకు నిదర్శనమని మండిపడ్డారు. రాజధానిని సర్వనాశనం చేసి అమరావతినీ చంపటానికి ఇళ్ల స్థలాల నాటకమే జగన్ కుట్రకు రూపమని ధ్వజమెత్తారు. రాజధానిలో పేదలను ఇళ్లస్థలల పేరుతో మోసం చేయడానికి బహిరంగ సభ పెట్టారని మండిపడ్డారు.

రాజధానిలో పేదలకు ఇళ్లస్థలల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమిటో అందరూ గమనించాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించే స్థాయికి ముఖ్యమంత్రి వెళ్లడం చూస్తే ఆవేదన కలుగుతుందన్నారు. పేదలసంక్షేమం పేరుతో దోపిడీకి తీసిన దరిద్రుడు జగన్ అని విరుచుకుపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు పేదల రక్తాన్ని తాగుతున్న నరరూప రాక్షసుడు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పన్నుల మోత, నిత్యావసర వస్తువుల మోత, కరెంటు చార్జీల మోత....మోతలమీద మోతలు పేదలపై మోగిస్తున్నాడని విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

Amaravati: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Janasena: వచ్చే ఎన్నికలపై రహస్య సర్వే.. దూకుడు పెంచిన జనసేనాని



Next Story

Most Viewed