Breaking: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

by Disha Web Desk 16 |
Breaking: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు ప్రకటించింది. సీపీఎస్‌ను రద్దు చేసింది. అంతేకాదు కొత్త పెన్షన్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. అలాగే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28న జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదలకు మంత్రులు ఆమోదం తెలిపారు. 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రాల్లో అన్నిట్లోనూ 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు కొత్త డీఏ అమలుకు చర్యలు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. ఏపీ కేబినెట్ భేటీలో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీల్లో 706 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమి లీజు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read..

ఏపీ కేబినేట్ కీలక సమావేశం.. సీపీఎస్‌పై నిర్ణయం:


Next Story

Most Viewed