పల్నాడులో ఎండిపోతున్న పంటలు.. మంత్రి అంబటి ఏమన్నారంటే..!

by Disha Web Desk 16 |
పల్నాడులో ఎండిపోతున్న పంటలు.. మంత్రి అంబటి ఏమన్నారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఎండలు తీవ్రతరం పెరుగుతుండటంతో ఏపీలో పలుచోట్ల సాగు నీటి సమస్య ఏర్పడుతోంది. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమ పంటలకు నీరు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి అంబటి దృష్టికి పల్నాడు జిల్లా రైతులు తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించారు. పంటలు ఎండిపోతున్నాయని చాలా మంది రైతులు తనకు విజ్ఞప్తి చేశారని చెప్పారు. నీటి విడుదలపై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ, ఏపీ దీనికి అంగీకరించాలని తెలిపారు. కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నాయన్నది నిజమేనని పేర్కొన్నారు. నీటిలో 66 శాతం వాటా ఏపీదని, 34 శాతం తెలంగాణదని అంబటి తెలిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి: మినిస్టర్ VS ఎంపీ.. రచ్చకెక్కిన ప్రొటోకాల్ వివాదం



Next Story

Most Viewed