రెండు రోజుల్లో ఏపీకి కూల్ న్యూస్

by Disha Web Desk 16 |
రెండు రోజుల్లో ఏపీకి కూల్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిలా మారింది. భానుడి ప్రతాపానికి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవ్వడం వీటికి తోడు వడగాల్పులు విపరీతంగా వీస్తున్న నేపథ్యంలో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య 13కు చేరిన సంగతి తెలిసిందే. ఎండలు మండిపోతున్న తరుణంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో గురువారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2° నుండి 4° లు గుర్తించబడిన తగ్గుదల ఉండే అవకాశము ఉంది. అలాగే శుక్రవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన తగ్గుదల ఉండే అవకాశము ఉందని స్పష్టం చేసింది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

ఇకపోతే గురువారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది అని స్పష్టం చేసింది. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉందని తెలిపింది. అలాగే శుక్రవారం ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2°నుండి 4°లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉన్నది.

రాయలసీమ

రాయలసీమ ప్రాంతంలో గురువారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉందని తెలిపింది. ఇకపోతే శుక్రవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

విశాఖలో చంద్రబాబు కు ఘనస్వాగతం

High Tention: అటు తాత, ఇటు భార్య... ఎటూ తేల్చుకోలేకపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఓటు ఎవరికో..?


Next Story

Most Viewed