Breaking: ఈతకు వెళ్లి.. నలుగురు మృతి

by Disha Web Desk 16 |
Breaking: ఈతకు వెళ్లి.. నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్:ఎండాకాలం వచ్చింది. పట్టణాలు, పల్లెల్లో ఎండ దంచి కొడుతోందిఎండాకాలం వచ్చింది. పట్టణాలు, పల్లెల్లో ఎండ దంచి కొడుతోంది. స్కూల్లు, కాలేజీలకు వేసవి సెలవులు కూడా వచ్చాయి. దీంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పెద్దలు, పిల్లలు.. చెరువులు, వాగులు, బావులు, కుంటల వైపు పరుగులు తీస్తున్నారు. ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు.

అయితే కొన్ని సమాయాల్లో ఈ ఈత సరదా విషాదాన్ని నింపుతోంది. వినోదాన్ని ఇస్తున్న ఆ నీరే వారి ప్రాణాలు తీస్తోంది. నీటిలో ఈదుతూనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు. నీటిలో ఉన్న గుంతలు గమనించకనో.. ఈత రాకనో.. కారణాలమైనా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు విషాదాన్ని మిగుల్చుతున్నారు.

ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరుచూ జరుగుతున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈతకు వెళ్లి నలుగురు చనిపోయారు. దీంతో వారి కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.

ఓ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో జరుగగా.. మరో ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక తిరుపతి జిల్లా గూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. పంబలేరు వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. మృతులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. నల్గొండ జిల్లా దేవర‌కొండలోనూ బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. మృతులు జ్యోతి, నాగారాజుగా గుర్తించారు.

Also Read..

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు



Next Story

Most Viewed