రాష్ట్రంలో వ్యవస్థలు దిక్కుమాలిపోయాయి: మాజీ మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-23 14:08:59  IST  )

రాష్ట్రంలో వ్యవస్థలు దిక్కుమాలిపోయాయని మాజీ మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు..

రాష్ట్రంలో వ్యవస్థలు దిక్కుమాలిపోయాయి: మాజీ మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వ్యవస్థలు దిక్కుమాలిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Former Minister Botsa Satyanarayana) తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM Jagan) కారు ఢీకొని సింగయ్య మృతి చెందిన ఘటనపై టీడీపీ(Tdp) నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. జగన్ పర్యటనలో పోలీసుల వైఫల్య కనిపించిందన్నారు. మాజీ సీఎం అని కూడా చూడకుండా సరైన భద్రత కల్పించలేదని ఆరోపించారు. సింగయ్య మృతిపై టీడీపీ నేతల చెప్పిన ప్రకారం పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. తొలుత జగన్ వాహనం ఢీకొట్టలేదని ఎస్పీ తెలిపారని, ఆ తర్వాత మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh), పవన్ కల్యాణ్‌(Pawankalyan) భద్రత ఇబ్బందులు పడ్డారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిక్కులమాలిన, దిగజారిపోయిన పాలన సాగుతోందని బొత్స తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story