రైతులకు మాజీ సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్

by Disha Web Desk 19 |
రైతులకు మాజీ సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండగానే మాజీ సీఎం చంద్రబాబు ఇప్పటి నుండే స్పీడ్ పెంచారు. అధికారమే లక్ష్యంగా నిత్యం ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం చంద్రబాబు టీడీపీ తొలి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాజమండ్రిలో టీడీపీ తలపెట్టిన మహానాడులో చంద్రబాబు ‘‘భవిష్యత్‌కు గ్యారెంటీ’’ పేరుతో టీడీపీ తొలి ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మ్యానిఫెస్టోలో చంద్రబాబు వరాల జల్లు కురిపించారు.

ముఖ్యంగా మహిళలు, యువత, రైతులే టార్గెట్‌గా టీడీపీ మ్యానిఫెస్టో రూపొందించారు. ఇందులో భాగంగా రైతులకు చంద్రబాబు గుడ్ న్యూ్స్ చెప్పారు. రైతుల కోసం ప్రత్యేకంగా అన్నదాత కార్యక్రమం చేపడుతామని.. పెట్టుబడి కింద రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సహయం అందిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. ఇంటింటికీ మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని తెలిపారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తామని సంచలన ప్రకటన చేశారు.

అంతేకాకుండా టీడీపీ తొలి దశ మ్యానిఫెస్టోలో మహిళలకు వరాల జల్లు కురిపించారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం నిర్వహించడంతో పాటు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుందని.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని తెలిపారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ: చంద్రబాబు హామీల వర్షం

Next Story

Most Viewed