గన్నవరం ఎయిర్‌పోర్టును చుట్టేసిన పొగమంచు.. గాల్లోనే విమానాలు చక్కర్లు

by Disha Web Desk 19 |
గన్నవరం ఎయిర్‌పోర్టును చుట్టేసిన పొగమంచు.. గాల్లోనే విమానాలు చక్కర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టులో విమాన సర్వీస్‌లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారుజూమున గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పొగమంచు దట్టంగా అలుముకుంది. రన్ వే‌లు కనిపించకుండా పొగ మంచు కప్పేయడంతో విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్ అయ్యేందుకు వచ్చిన పలు విమానాలు రన్ వేను పొగమంచు కప్పేయడంతో గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. టేకాఫ్, ల్యాండింగ్‌కు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.



Next Story

Most Viewed