ముగిసిన ములాఖత్: కంటతడిపెట్టిన భువనేశ్వరి..నిబ్బరంగా ఉండాలన్న బాబు

by Disha Web Desk 21 |
ముగిసిన ములాఖత్: కంటతడిపెట్టిన భువనేశ్వరి..నిబ్బరంగా ఉండాలన్న బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడును సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులు కలిశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో భాగంగా కలిశారు. ములాఖత్‌లో భాగంగా 40 నిమిషాలపాటు చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడును చూసి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు భువనేశ్వరిని ఓదార్చారు. అధైర్య పడవద్దని.. నిబ్బరంగా ఉండాలని సూచించారు. అనంతరం చంద్రబాబు ఆరోగ్యంపై భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. బ్రాహ్మణి సైతం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు విచారించారని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. నారా బ్రాహ్మణిని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు భుజం తట్టారు. ఈ సందర్బంగా నారా లోకేశ్ గురించి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బాసటగా నిలవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న మద్దతును బ్రాహ్మణి వివరించారు. ప్రభుత్వం నిరసనకారులపై కక్షపూరితంగా వ్యవహరించడాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సూచించారు.



Next Story

Most Viewed