మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం.. ఎట్టకేలకు స్పందించిన ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-15 16:43:54  IST  )

మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఎట్టకేలకు స్పందించారు. తనకు ఎలాంటి దురఅలవాట్లు లేవని, తన స్నేహితుడిని కలిసేందుకు అక్కడికి వెళ్లానని ఆయన తెలిపారు. ..

మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం.. ఎట్టకేలకు స్పందించిన ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం(Moinabad drug case)పై ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్(Eluru TDP MP Putta Mahesh Yadav) ఎట్టకేలకు స్పందించారు. తనకు ఎలాంటి దురఅలవాట్లు లేవని, తన స్నేహితుడిని కలిసేందుకు అక్కడికి వెళ్లానని ఆయన తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దుష్ప్రచారాలను నమ్మొద్దని చెప్పారు. తనను కలవాలని కొందరు చాలా రోజులుగా కోరారని, అందుకే వారిని కలిసేందుకు వెళ్లానన్నారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు అని పుట్టా మహేశ్ యాదవ్ అన్నారు. పూర్తి వివరాలతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తానన్నారు. నిజం గెలుస్తుందని, కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పిలుపునిచ్చారు.

కాగా..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని డ్రగ్స్ నిర్వహించడంతో ఆరుగురికి పాజిటివ్ అని వచ్చింది. ఇందులో పుట్టా మహేశ్ యాదవ్ సైతం ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈమేరకు విపక్షాలు తీవ్ర విమర్శలు కురిపించాయి. మరోవైపు పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు అయింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి సైతం ఊరట లభించింది. మిగిలిన నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టారు.

Next Story