Tdp: లాయర్ల ములాఖత్‌ను ఎందుకు తగ్గించారు?

by Disha Web Desk 16 |
Tdp: లాయర్ల ములాఖత్‌ను ఎందుకు తగ్గించారు?
X

దిశ, (ఉభయ గోదావరి ప్రతినిధి): రాష్ట్రంలో జగన్ ఆడుతున్న వికృత క్రీడకు పులుస్టాప్ పడాలని మాజీమంత్రులు కిమిడి కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులు ఇచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం లభించలేదని చెప్పారు. చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. చంద్రబాబుతో లాయర్లు రోజువారీ అయ్యే ములాఖత్‌లను కూడా తగ్గించారని, దళితులను చంపిన వారికి, శిరోముండనాలు చేసిన వారికి ఇష్టానుసారంగా ములాఖత్‌లకు అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో బుధవారం నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కారాగారం వద్ద కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు.

కళావెంకట్రావు మాట్లాడుతూ ‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాకు ఆందోళన ఉంది. చంద్రబాబుకు చేసే వైద్య పరీక్షలు, డాక్టర్లు ఏం సలహాలు ఇచ్చారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని భువనేశ్వరి ఇటీవల అధికారులకు లేఖ కూడా రాశారు. చంద్రబాబు వైద్య నివేదికను వ్యక్తిగత డాక్టర్లకు పంపిస్తే పాత మందులకు మార్పులు చేర్పులు చేస్తే గానీ పరిస్థితి మారుతుందేమో చూడాలి. వైద్య నివేదికలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి.?. తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలతో 40 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారు. కేసును ఏదో విధంగా ఆలస్యం చేసి చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. 40 రోజులుగా ఒక్క ఆధారం కూడా కోర్టులకు చూపించలేదు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండే విధంగా జగన్ ఉండటం లేదు. ఈ ప్రభుత్వంలో ఎవరికీ స్వేచ్ఛ లేదు. జైళ్ల శాఖ డీఐజీ ప్రభుత్వాన్ని మెప్పించేలా మాట్లాడుతున్నారు. పోలీస్ వ్యవస్థలకు కొన్ని విలువలు ఉంటాయి. వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. జగన్ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని పోలీసులను పావులా వాడుకుంటున్నారు. కొందరు చేసే చెడ్డ పనులతో వ్యవస్థలకు చెడ్డపేరు వస్తోంది. డాక్టర్ల నివేదకను వెంటనే కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఆరోగ్య నివేదిక డాక్టర్లు ఇవ్వకుండా..పోలీసులు ఎందుకు ఇస్తున్నారు.?. అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీనే కాదు. బాధ్యతలు కూడా ఉంటాయి. చంద్రబాబు వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు అందించాలి.’’అని డిమాండ్ చేశారు.

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి చూస్తే బాధగా ఉంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి పట్ల ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కుటుంబ సభ్యులకు కూడా చెప్పరా.?. లాయర్ల ములాఖత్‌ను కూడా తగ్గిస్తున్నారు. దళితులను చంపినా, శిరోముండనాలు చేసిన వారికి ఇష్టానుసారంగా ములాఖత్‌లకు అవకాశం ఇస్తున్నారు. చట్టాల్లోని లోపాలను వినియోగించుకుని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు. ఈ వికృతానందం ఎన్నో రోజులు ఉండదు. భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీసీలను అడ్డుకున్నారు. భువనేశ్వరిని కలిసే హక్కు బీసీలకు లేదా.?. పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా.?. చంద్రబాబును జైల్లో పెట్టిన నాటినుండే వైసీపీ కౌండ్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక ఉన్నత వ్యక్తి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదంటే న్యాయవ్యవస్థలు కూడా ఆలోచించాలి. చంద్రబాబుకు ఆరోగ్య పరంగా ఏదన్నా అయితే జగన్ దే బాధ్యత.’’ అని కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర హెచ్చరించారు.


Next Story

Most Viewed