నేడు సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన

by velandi.Saikiran |

నేడు సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu naidu ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పోలవరం (Polavaram ) పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. నేడు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోలవరం లో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. అంటే ఉదయం తొమ్మిది గంటలకే విజయవాడ ( Vijayawada ) నుంచి పోలవరానికి బయలుదేరుతారు. ఇక చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu ) పోలవరం పర్యటన నేపథ్యంలో... అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకంగా 500 మంది పోలీసులతో... పోలవరం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు.


అయితే ఇవాళ.... 11 గంటల సమయంలో పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకోనున్న చంద్రబాబు.... ప్రాజెక్టు పనులపై ఆరా తీయబోతున్నారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా ఆదేశాలు ఇవ్వబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. పనుల్లో జాప్యం జరగకుండా... నెలకు ఒక్క సారైనా పోలవరం పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ఇవాళ పోలవరం పర్యటన ఖరారు చేసుకున్నారు. ఇక ఇవాళ పోలవరం పర్యటన అనంతరం.... ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. ఎలా ముందుకు వెళ్లాలి..? త్వరితగతిన పనులు ఎలా పూర్తి చేయాలి ? అనే వివరాలపై సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu ).

Next Story