- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ వాట్సప్ గ్రూపుల్లో నూర్.. అమాయకంగా ఉంటూనే.. : వివరాలు వెల్లడించిన ఎస్పీ
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ గురించిన వివరాలను ఎస్పీ రత్న మీడియాకు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: ధర్మవరంలో ఉగ్రకార్యకలాపాలు జరుగుతున్నాయన్న వార్తలు రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ గురించిన వివరాలను ఎస్పీ రత్న మీడియాకు వెల్లడించారు. ధర్మవరంలో నూర్ మహమ్మద్ తో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరూ పాక్ కు చెందిన వాట్సప్ గ్రూపుల్లో కీలక సమాచారాన్ని షేర్ చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇద్దరినీ ప్రస్తుతం కడప జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.
నూర్ మహమ్మద్ స్థానికంగా చికెన్ బిర్యానీ తయారు చేస్తూ ఎంతో అమాయకంగా కనిపిస్తూనే.. మసీదుల వద్ద యువకులకు ఉగ్ర సమాచారాన్ని చేరవేశాడని కౌంటర్ ఇంటెలిజెన్స్ కు సమాచారం రావడంతో అరెస్ట్ చేశామన్నారు. 30కి పైగా పాక్ కు చెందిన వాట్సప్ గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నాడని, ఆ గ్రూపులతో ఉన్న సంబంధాలపై కస్టడీలోకి తీసుకున్నాక విచారిస్తామని చెప్పారు. వాట్సప్ గ్రూపుల గురించిన సమాచారం, ఉగ్ర సంస్థలతో లింకుల గురించిన మరిన్ని వివరాలను విచారణ అనంతరం చెప్తామని ఎస్పీ తెలిపారు.






