- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ క్షణం: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉన్నారని, ఇది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ క్షణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(Amaravati)కి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్ సభ(Lokhsabha)లో ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉన్నారని, ఇది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ క్షణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) పేర్కొన్నారు. ఈ చట్టబద్ధతతో అమరావతి ఇకపై ఆంధ్రుల శాశ్వత రాజధానిగా సుస్థిర స్థానాన్ని పొందిందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అమరావతి కేవలం ఒక నగరంలా కాకుండా భావితరాల అభివృద్ధికి కేంద్రంగా అసలైన ప్రజా రాజధానిగా విరాజిల్లుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాజధాని నిర్మాణం ఇక వేగవంతం కానుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జీర్ణించుకోలేక ..
అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని జీర్ణించుకోలేక కొంతమంది విషం చిమ్ముతున్నారని, సుప్రీంకోర్టు తీర్పులను కూడా అపహాస్యం చేస్తున్న అలాంటి వారికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, కుట్రలు పన్నే వారికి కాలమే బలమైన పాఠం నేర్పుతుందని విమర్శించారు.






