- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ కార్పొరేషన్ లో రాక్షసపాలన : ఎంపీ కేశినేని చిన్ని
అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుంటోంది.

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్రంలో రాక్షస పాలన ముగిసింది. కానీ విజయవాడలో (Vijayawada) మాత్రం ఇంకా కొనసాగుతోందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొవులైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లను కుటుంబ సమేతంగా ఆయన మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల ప్రత్యేక ఆశీర్వచనం పొందారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం స్వీరించారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని.. వారికి ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడించారు.
అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోంది
విజయవాడను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) అన్నారు. ప్రాంత అభివృద్ధి కోసం ఏడాదది క్రితమే డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. కానీ కౌన్సిల్ లో డీపీఆర్ కు ఆమోదం లభించలేదన్నారు. వైసీపీ తన కుయుక్తులతో విజయవాడ అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక జీఓ ద్వారా విజయవాడ అభివృద్ధికి చర్యుల తీసుకున్నాం అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గేమ్ చేంజర్ గా నిలిచిన యువగళం
గత ప్రభుత్వ అరాచక పాలనపై సమర శంఖం పూరించిన మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో మూడు ఏళ్లు పూర్తి చేసుకుందపి ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా నిలిచిందని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఇబ్బందులు సృష్టించినా, అడ్డుకోవాలని కుట్రలు పన్నినా.. జనమే బలమై, బలగమై యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్రయాత్రగా నడిపించారన్నారు. 3,132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు.. 226 రోజుల అలుపెరగని పోరాటం.. రాష్ట్రంలో 164 స్థానాల్లో ఘన విజయం సాధించడానికి ఈ యువగళం పాదయాత్ర ఎంతగానో తోడ్పడిందని వెల్లడించారు.






