CM Jagan : రేపు విశాఖకు CM,AU విద్యార్థులతో Intract

by Disha Web Desk 21 |
YS Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన ఖరారైంది. మంగళవారం వైఎస్ జగన్ విశాఖలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడింది. విశాఖ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకోనున్నట్లు వెల్లడించారు. ముందుగా కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం హై–టీలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఎలిమెంట్‌ ఫార్మా ఇంక్యుబేషన్‌ సెంటర్, బయో మానిటరింగ్‌ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం ఇంటరాక్ట్‌ అవుతారు. ఈ కార్యక్రమం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు అని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి పెద్దాపురంలో హైటెన్షన్ : లై డిటెక్టర్ పరీక్షలకు TDP,YCP సై


Next Story