- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలిసారి పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ : CM చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. అర్హులైనవారికి ఇళ్ల తాళాలను అందజేశారు. హేమలత, షేక్ ముంతాజ్ బేగంలకు ఇళ్ల తాళాలను అందజేసి, గృహప్రవేశాలు చేశారు. అనంతరం ప్రజా వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. త్వరలోనే మిగతా ఇళ్లను కూడా పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదని, భవిష్యత్తుకు భద్రత అని తెలిపారు. తొలిసారి పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈరోజు తన జీవితంలోనే చాలా ఆనందకరమైన రోజని తెలిపారు. ఒక్కరోజే 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నిన్న కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశామని, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త తయారుకావాలని సూచించారు. వైసీపీ పాలనలో నివాసానికి యోగ్యం కాని ప్రదేశాల్లో స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే ఇసుకను కూడా పందికొక్కుల్లా దోచుకున్నారని దుయ్యబట్టారు. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన వారికి ఇళ్లను అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ముస్లింలకు సైతం అందరితో సమానంగా ఇళ్లను కేటాయిస్తామన్నారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలో 5.90 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.






