- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: ఫస్టాఫ్ కంప్లీట్.. చంద్రబాబుకు గంట లంచ్ బ్రేక్..!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును కస్టడీకి తీసుకుని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును కస్టడీకి తీసుకుని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. కాగా, రెండవ రోజు విచారణలో భాగంగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చంద్రబాబు తరుఫు లాయర్ల సమక్షంలోనే దర్యాప్తు చేస్తున్నా అధికారులు.. బాబుపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట కావడంతో రూల్స్ ప్రకారం అధికారులు చంద్రబాబుకు గంట లంచ్ బ్రేక్ ఇచ్చారు. భోజన విరామం తర్వాత తిరిగి అధికారులు 2 గంటలకు దర్యాప్తు కొనసాగించనున్నారు.
కాగా, ఇవాళ్టితో సీఐడీ కస్టడీ ముగుస్తుండటంతో స్కామ్‌కు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు చంద్రబాబుపై అధికారులు ప్రశ్నల వర్షం కురపించినట్లు తెలుస్తోంది. మధ్నాహ్నం సెషన్‌లో విచారణను కొలిక్కి తెచ్చే యోచనలో సీఐడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో చంద్రబాబు సీఐడీ కస్టడీ, జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుండటంతో అధికారులు వర్చువల్ పద్దతిలో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ స్కామ్‌కు సంబంధి మరింత సమాచారం రాబట్టేందుకు చంద్రబాబును సీఐడీ అధికారులు మరోసారి కస్టడీ కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.






