Tirumala: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత

by Vemula.Srinu Prasad |

చంద్రగ్రహణంకారణంగా మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు..

Tirumala: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రగ్రహణం(Lunar Eclipse) కారణంగా మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయాన్ని(Tirumala Srivari Temple) మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు(TTD officials) ప్రకటించారు. ఆ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని(Tirumala Venkateswara Swamy Temple) సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 3న సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుందని చెప్పారు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం జరుగుతుందని, అదే రోజు సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తరాని తెలిపారు. ఆ తర్వాత రాత్రి 8:30గంటల నుంచి ఆలయం పునః ప్రారంభవుతుంది.

ఆర్జితసేవలు రద్దు

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న అష్టదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.

Next Story