- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: టీడీపీ అధికారంలోకి రావాలని షిర్డీలో పూజలు
by Vemula.Srinu Prasad |
2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని షిరిడి సాయిబాబా సన్నిధి వద్ద మోకాళ్ళ మీద కూర్చొని తెలుగుదేశం పార్టీ నేతలు వేడుకున్నారు. ..

X
దిశ, తిరుపతి: 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని షిరిడి సాయిబాబా సన్నిధి వద్ద మోకాళ్ళ మీద కూర్చొని తెలుగుదేశం పార్టీ నేతలు వేడుకున్నారు. తిరుపతి 35వ కార్పొరేటర్ ఆర్. సి. మునికృష్ణ, ప్రధానకార్యదర్శి మహేష్ యాదవ్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్.పి. శ్రీనివాసులు, తిరుపతి టి. ఎన్.టి.యు.సి పార్లమెంట్ అధ్యక్షుడు జయరామి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు- పవన్ నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతి పాలన ఎక్కువ అయిపోయిందని విమర్శించారు. భూ కబ్జాలు, ఇసుక, లిక్కర్ మాఫియా, రౌడీయిజం మితిమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కట్టలేదని, యువతకి ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆక్షేపించారు. మంత్రులు నుంచి కార్యకర్తల వరకు దోసుకుంటున్నారని దుయ్యబట్టారు.
Next Story






