Yuvagalam: నారా లోకేష్ పాదయాత్రలో న్యాయవ్యాదులు ఏం కోరారంటే..!

by Disha Web Desk 16 |
Yuvagalam: నారా లోకేష్ పాదయాత్రలో న్యాయవ్యాదులు ఏం కోరారంటే..!
X

దిశ, తిరుపతి: అశేష జనవాహిని మధ్య లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఎక్కడికక్కడ లోకేశ్‌కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. స్థానిక సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటున్న లోకేష్‌.. ప్రజలకు భరోసా కల్పిస్తోన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగుతున్నారు.

చిత్తూరు అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద ముస్లిం పెద్దలతో నారా లోకేష్‌ పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌లో స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అటు చిత్తూరు కోర్టు సర్కిల్‌లో లాయర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కూడా లోకేష్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం పలు విజ్ఞప్తులు చేశారు. యువ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధి కోసం చిత్తూరులో లా అకాడమీ ప్రారంభించాలని కోరారు. న్యాయవాదుల మరణానంతరం కుటుంబాలకు ఇచ్చే భృతిని రూ. 10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక భరోసాలేని న్యాయవాదుల కుటుంబసభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. న్యాయవాదులకు మార్కెట్ ధరపై ఇళ్లస్థలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రూ. 40.32 కోట్లతో చేపట్టిన చిత్తూరు కోర్టు భవన నిర్మాణాలకు నిధులు వెంటనే విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

న్యాయవాదుల సమస్యలపై స్పందించిన లోకేష్.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయవ్యవస్థపై కక్షగట్టారని విమర్శించారు. ఎన్నడూ లేనివిధంగా న్యాయమూర్తులను అవమానిస్తూ వైసీపీ పెద్దలే పోస్టులు పెట్టి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని, న్యాయవాదుల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల డెత్ క్లెయిమ్‌ను రూ. 10 లక్షలకు పెంచుతామన్నారు. చిత్తూరు కోర్టు భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని, న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed