Tirumala: టీటీడీకి కేంద్రం ఊరట.. ఆ విషయంలో మినహాయింపు

by Disha Web Desk 16 |
Tirumala: టీటీడీకి కేంద్రం ఊరట.. ఆ విషయంలో మినహాయింపు
X

దిశ, తిరుపతి: తిరుపతి దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. శ్రీవారికి భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపు ఇచ్చింది. భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కొనాలని టీటీడీని కేంద్ర ప్రభుత్వం కోరింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఇలాంటి మినహయింపు ఇస్తున్నట్లు టీటీడీకి కేంద్ర హోంశాఖ సమాచారమిచ్చింది.


ఇదిలా ఉంటే గతంలో గతంలో ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు వ్యవహరంలో కేంద్ర ప్రభుత్వం టీటీడీకి రూ. 3 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. జరిమానా చెల్లించిన అనంతరం ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ రెన్యూవల్ చేసింది. అయితే లైసెన్స్ రెన్యువల్ చేసినా ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసే సమయంలో దాతల వివరాలు తెలపాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం సడలించలేదు. తాజాగా టీటీడీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: Breaking: ఏపీలో మే 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Next Story

Most Viewed