Ap News: టీవీ రిపోర్టర్‌పై కాల్పులు.. ఆలస్యంగా గుర్తింపు!

by Disha Web Desk 16 |
Ap News: టీవీ రిపోర్టర్‌పై కాల్పులు.. ఆలస్యంగా గుర్తింపు!
X

దిశ, కడప : అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీవీ రిపోర్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. బుల్లెట్ విషయం తెలియని ఆ వ్యక్తి వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే స్కానింగ్‌లో బులెట్ ఉన్నట్లు వైద్యలు గుర్తించారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన పర్వతరెడ్డి (45) పీలేరులో టీవి రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. జనవరి 31 సాయంత్రం 5.45 గంటలకు ఆయన రాయచోటి చిత్తూరు రింగ్ రోడ్డు నుంచి వెలుతుండగా శివాలయం కూడలి వద్ద ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. దీంతో పర్వతి రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

అయితే పర్వతరెడ్డి వాహనాల టైర్ల క్రింద నుంచి రాయి వచ్చి తగిలిందని భావించారు. కడప హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడి వైద్యులు నిర్వహించిన స్కానింగ్‌లో మెటల్ ఎఫెక్ట్ ఉన్నట్లుందని, మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు సి.ఎం.సి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పర్వతరెడ్డిని వేలూరు సి.ఎం.సి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పర్వతరెడ్డి బాడీని స్కాన్ చేసి బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత శస్ర్త చికిత్స చేసి పర్వతరెడ్డి బాడీలో ఉన్న బుల్లెట్‌ను బయటకు తీశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్వతరెడ్డిపై జరిగిన కాల్పులపై రకరకాల కారణాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. బంధువుల మధ్య ఆస్తి తగదాలకు సంబంధించి కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed