- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Police custody: పోలీసు కస్టడీకి .. పేలుళ్ల కుట్ర నిందితులు
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసిన ఇద్దరు నిందితులు సిరాజ్, సమీర్‌ను పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నారు.

విశాఖనుంచి బారీ బందోబస్తు నడుమ విజయనగరానికి తరలింపు
నేటి నుంచి ఏడు రోజులపాటు విచారణ
విచారణ చేపట్టనున్న ఏపీ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసిన ఇద్దరు నిందితులు సిరాజ్, సమీర్‌ను పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. కొద్దిజేపటి కిందట విజయనగరం పోలీసులు విశాఖపట్నం సెంట్రల్‌జైలు నుంచి వారిని కస్టడీ లోకి తీసుకున్నారు. వారిద్దరినీ గట్టి బందోబస్తు మధ్య రెండు వాహనాల్లో విజయనగరం తరలించారు. వారిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టులో నిన్న విచారణ జరిగింది. వారి కస్టడీకి సంబంధించిన తీర్పు ఉత్తర్వులు పొద్దుపోయాక రావడంతో ఈ ఉదయం వారిని పోలీసులు కస్టడీకి తరలించారు. ఉగ్రదాడులకు సంబంధించిన వ్యక్తులు కావడంతో వారు ప్రయాణించే 40 కిలోమీటర్ల దారిలో భారీ నిఘా ఏర్పాటు చేశారు.
విజయనగరం టూటౌన్పోలీసులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ఐఏ (NIA) అధికారులు విజయనగరానికి చేరుకున్నారు. ఏడురోజులపాటు వీరి విచారణ జరగనుంది. పేలుళ్లకు ఎటుంటి ప్రయత్నాలు చేశారు.. దీని వెనుక ఎవరు ఉన్నారు..? హైదరాబాద్‌కు చెందిన కొందరితో వీరు గతంలో కలిసి ఉండడం అక్కడ పేలుళ్లకు కుట్ర చేయడం వంటివి విచారించనున్నారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి వీరు భారీ కుట్రం చేశారనే విషయాలు వెలుగులోకి వస్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు. వారిద్దరినీ విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలకు తరలించారు. ఇన్చార్జి ఎస్పీ మాధవరెడ్డి అక్కడికి చేరుకున్నారు.






