- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:టీటీడీ ఉద్యోగి పై రెచ్చిపోయిన బోర్డు సభ్యుడు.. కారణం ఏంటంటే?
నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల(Tirumala) ఆలయం ముందు టీటీడీ బోర్డు(TTD Board) సభ్యుడు బూతులతో రెచ్చిపోయాడు.

దిశ,వెబ్‌డెస్క్: నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల(Tirumala) ఆలయం ముందు టీటీడీ బోర్డు(TTD Board) సభ్యుడు బూతులతో రెచ్చిపోయాడు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం గేటు వద్దకు చేరుకున్నారు. అయితే మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, కావాలంటే ఉన్నతాధికారులను అడగండని టీటీడీ ఉద్యోగి అనడంతో నరేష్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారు.
ఈ క్రమంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అంటూ ఆయనతో వాదనకు దిగారు. ‘‘నిన్ను ఇక్కడ పెట్టిందెవరు? నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు బయటకు పోవయ్యా.. థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు పెట్టారు? వాడి పేరేంటి?’’ అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు. కొందరు ఉద్యోగులు కనీసం తమ స్థాయికి కూడా గౌరవం ఇవ్వట్లేదని, దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆయన మాటలు విన్న భక్తులు, ఉద్యోగులు షాకయ్యారు. స్వామివారి చెంత బూతు పురాణం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలా ప్రవర్తించిన బోర్డు సభ్యుడి పదవికి ఉన్న గౌరవం ప్రతిష్ఠలను మంటగలిపారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గొడవతో అక్కడికి చేరుకున్న టీటీడీ వీజీవో సురేంద్ర, ఏఈవో మునిరత్నం తదితరులు నరేశ్‌కుమార్‌కు నచ్చజెప్పి మహాద్వారం గేటు ద్వారా బయటకు పంపడంతో గొడవ సద్దుమణిగింది.






