జన్మజన్మలకు ఆయనకే పుట్టాలి: పురంధేశ్వరి ఎమోషనల్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-18 06:42:43  IST  )

ఎన్ని జన్మలైనా తన తండ్రి నందమూరి తారక రామారావుకే పుట్టాలని తాను కోరుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి అన్నారు...

జన్మజన్మలకు ఆయనకే పుట్టాలి: పురంధేశ్వరి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్ని జన్మలైనా తన తండ్రి నందమూరి తారక రామారావు(Nandamuri Rama Rao)కే పుట్టాలని తాను కోరుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి(Bjp state Chief Purandeswari) అన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా విజయవాడ(Vijayawada)లో ఆమె ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్‌(Ntr)కు మరణం లేదన్నారు. ఏ రంగంలోనైనా ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. సినిమా, రాజకీయ రంగానికి వన్నె తెచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో తనకంటూ కొత్త చరిత్రను రాసుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయం ఏపీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Next Story