- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో పరేషాన్.. BJP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కూటమి నాయకుల్లో సమన్వయ లోపంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసక్తికర వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. మూడు పార్టీలు పదవులు సైతం పంచుకున్నాయి. కూటమి నేతృత్వంలో మిగిలిన ఎమ్యెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజా సేవ చేస్తున్నారు. చిన్న, చిన్న ఘటన మినహా టీడీపీ(Tdp), జనసేన(Janasena), బీజేపీ(Bjp) ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగానే పని చేస్తున్నారు. అయితే జిల్లాలకు కేటాయించిన ఇంచార్జులతోనే కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఓ పార్టీ అయితే, ఇంచార్జి మరో పార్టీ కావడంతో ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి చేపట్టి కార్యక్రమాల్లో ఎడమొహం పెడమొహం పెట్టుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక ఇదే విషయాన్ని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(Bjp Mla Vishnukumar Raju) చెప్పారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మూడు పార్టీల ఎమ్మెల్యేల మధ్య కో-ఆర్డినేషన్ బాగానే ఉందని, ఒకే మాటపై ముందుకెళ్తున్నారని తెలిపారు. కానీ ఇన్‌ఛార్జ్‌లతోనే సమస్య వస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే, మరోపార్టీ ఇన్‌ఛార్జ్ మధ్య సమన్వయం లేకపోతే సమస్యలు వస్తాయని విష్ణుకుమార్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు కూటమిలో చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రజాప్రతినిధులు ఎవరు, ఏ నియోజకవర్గం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యల వెనక ఏం జరిగిందనేదానిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరా తీసి ఎమ్మెల్యేలు, ఇంచార్జుల మధ్య సమన్వయం కుదుర్చుతారేమో చూడాలి.






