- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎంల వివాదం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) డిప్యూటీ సీఎం(Deputy CM), సీఎం(CM)ల వివాదం కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) డిప్యూటీ సీఎం(Deputy CM), సీఎం(CM)ల వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై కూటమి పార్టీల నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(BJP MLA Vishnu Kumar Raju), నారా లోకేష్(Nara lokesh) ను సీఎం చేయాలి అనే దానిపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం(NDA Government) అధికారంలో ఉన్నదని, ఈ కూటమి పార్టీలలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని తెలిపారు.
వేరే పార్టీ వాళ్ల అభిప్రాయం గురించి తాను కామెంట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రస్తుతం మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయని, సీఎం అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. ఎప్పుడో సీఎం అనేదానికి ఇప్పుడు వివాదాలు ఎందుకని, దానికి ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. కూటమిలో ఉండి అప్పుడే ఊహాగాణాలు ఊహించుకోవడం సరికాదని, అధినాయకత్వానికి తెలిస్తే బాధ పడతారని, దీని గురించి వదిలేసి అభివృద్ధి గురించి చర్చించుకోవాలని సూచించారు. కేంద్రం ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)కి చాలా పెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇచ్చిందని, అది వదిలేసి పదవుల గురించి రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని బీజేపీ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.






