రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-22 11:48:35  IST  )

రాష్ట్రంలో పలు చోట్ల ఎండలు దంచికొడుతుంటే, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి.

రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పలు చోట్ల ఎండలు దంచికొడుతుంటే, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక చేతికి అందివచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ తరుణంలో మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని, వడగళ్ల వాన కురుస్తుందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) ప్రజలను అలర్ట్ చేసింది. ఈ క్రమంలో నేడు(మంగళవారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలీవాన బీభత్సం సృష్టించింది. పాడేరు ఏజెన్సీలో పలుచోట్ల భారీ వర్షం(Heavy Rain) కురిసింది. పాడేరు, చింతపల్లిలో వడగళ్ల వాన కురుస్తోంది. అలాగే అల్లూరి జిల్లా డుంబ్రిగూడ, బల్లుగూడ, అంత్రిగూడలో వడగళ్ల వాన కురిసింది.

అయితే.. క్యుములోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కిందికి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Next Story