రోజాను ఏకిపారేస్తున్న బాలయ్య ఫ్యాన్స్.. ఎవరు ఎవరి దగ్గరకు వెళ్లారు..?

by Disha Web Desk 7 |
రోజాను ఏకిపారేస్తున్న బాలయ్య ఫ్యాన్స్.. ఎవరు ఎవరి దగ్గరకు వెళ్లారు..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాల్లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రోజా.. రాజకీయాల్లో లేడీ సింగంలా దూసుకుపోతుంది. సెకెంట్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై మెరిసిన రోజా.. ఇటీవలే మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి పూర్తిగా ప్రజాసేవకే అంకితమయింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీలపై ఒంటికాలిపై విరుచుకుపడే ఈ ఫైర్ బ్రాండ్.. తాజాగా బాలయ్య బాబుపై విరుచుపడింది.

''బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జ‌గ‌న్ అన్న ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే..!!'' అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ కాగా.. ''సింహం విజయమ్మ దగ్గరకి వెళ్ళిందా..? లేక విజయమ్మ సింహం దగ్గరకి వెళ్ళిందా..?'' అని ఒకరు ''పంది బలిస్తే సింహం అవ్వదు, పిల్లి అరిస్తే పులి కాదు, కుక్కల అరిస్తే నాయకుడు కాలేరు'' అంటూ బాలయ్య బాబు అభిమానులు ఓ రేంజ్‌లో రిప్లైలు ఇస్తున్నారు.


Next Story

Most Viewed