చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం.. హీరో బాలకృష్ణ హాట్ కామెంట్స్

by Disha Web Desk 5 |
చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం.. హీరో బాలకృష్ణ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు ప్రజల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబు పని చేశారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు చూస్తున్నామని, ప్రజల జీవితాలు గతుకుల మయం అయ్యాయని సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యనించారు. పెనుంగొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికారని, ఇప్పటికి నాలుగేళ్లు అవుతున్నా.. పూర్తి చేయకపోవడం మన రాష్ట్రానికి పట్టిక ఖర్మ అని దుయ్యబట్టారు.

అలాగే ఈ ఐదేళ్లలో అభివృద్ది చేయ్యకపోగా, 13 లక్షల కోట్ల అప్పులు చేశారని, మళ్లీ అప్పులు పుడితేగాని జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. అంతేగాక గంజాయి, డ్రగ్స్ సప్లై చేయడంలో భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని నంబర్ వన్ గా చేశారని, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియాతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బాలకృష్ణ ఆరోపించారు. అలాగే చెత్త పన్ను వేసి ప్రజల నడ్డి విరచిన చెత్త ప్రభుత్వం అని, ఆంధ్రుల కళల రాజధాని అయిన అమరావతిని పట్టించుకోవట్లేదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని వదిలేశారని, ప్రత్యేక హోదా మరిచారని అన్నారు. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన వారిపై అక్రమ కేసులు పెట్టి సీఎం జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని బాలకృష్ణ విమర్శించారు.

Read More..

రాయలసీమ పౌరుషం ఉంటే నా చాలెంజ్ స్వీకరించు.. మాజీ మంత్రి అనిల్ కుమార్



Next Story

Most Viewed