- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా అమ్మాయి పేరుతో విద్యా సంస్థను నెలకొల్పండి: ఆయేరా మీరా తల్లిదండ్రులు
తమ కూతురి పేరుతో విద్యా సంస్థను నెలకొల్పాలని మహిళా కమిషన్‌ను ఆయేషా మీరా తల్లిదండ్రులు కోరారు..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో ఆయేరా మీరా(Ayesha Meera) హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆమె తల్లిదండ్రులు కీలక విజ్ఞప్తిని తెరపైకి తీసుకొచ్చారు. ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొప్పాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఏపీ మహిళా కమిషన్‌కు తెలిపారు. శనివారం ఆయేషా మీరా సంస్మరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజను కలిశారు. తమ కూతురి పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి, డిసెంబర్ 27న సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా కోరారు.
కాగావిజయవాడ ఇబ్రహీంపట్నంలో 18 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆయేషా మీరా హత్యకు గురయ్యారు. ఫార్మాసి చదువుతున్న ఆయేషాపై హాస్టల్‌లో అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకూ నిందితులెవరో కనిపెట్టలేకపోయారు. సత్యంబాబును దోషిగా చూపారు. కాని నిర్దోషిగా కోర్టు తీర్పు ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారించింది. నివేదికను కోర్టుకు సమర్పించింది. తీర్పు రావాల్సి ఉంది. ఈ సమయంలో ఆయేషా మీరా తల్లిదండ్రులు తమ కూతురిపేరుతో విద్యా సంస్థను నెలకొల్పాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.






