- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ని అవాంతరాలైనా పూర్తి చేస్తాం: భోగాపురం ఎయిర్‌పోర్టుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకూ 91.7 శాతం పనులు పూర్తి చేసిన యంత్రాంగం డిసెంబర్, జనవరి నెలలో టెస్ట్ డ్రైవ్ కు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ పోర్టు పనులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలైనా ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎయిర్ పోర్టు కేంద్ర బిందువు కాబోతోందన్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఈ ప్రాంతంలో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశలు పెంచే ఏవియేషన్ యూనివర్సిటీని సైతం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత 18 నెలల కాలంలో దేశంలో చాలా ఎయిర్‌పోర్టులను ప్రారంభించామని, టాక్సీవేలు, రన్ వేలను నాణ్యతతో నిర్మిస్తున్నామన్నారు. విశాఖ పారిశ్రామిక సదస్సులో ఏవియేషన్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.






