ఎక్కడైనా అమ్ముకోవచ్చు: తెలంగాణ ఆరోపణలపై ఏపీ విజయ డెయిరీ అభ్యంతరం

by Vemula.Srinu Prasad |

దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ విజయ డెయిరీ స్పష్టం చేసింది..

ఎక్కడైనా అమ్ముకోవచ్చు: తెలంగాణ ఆరోపణలపై ఏపీ విజయ డెయిరీ అభ్యంతరం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ విజయ డెయిరీ(AP Vijaya Dairy) పేరుతో మేఘనా ఫుడ్స్(Meghana Foods) అనే సంస్థ కల్తీ నెయ్యి విక్రయిస్తోందని తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి(Telangana Vijaya Dairy Chairman Gutta Amit Reddy) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై ఏపీ విజయ డెయిరీ అభ్యంతకరం వ్యక్తం చేసింది. తెలంగాణ(Telangana)లో తమ డెయిరీ ఉత్పత్తులను అడ్డుకునేందుకే కల్తీ ఆరోపణలు చేశారని తెలిపింది. తమ డెయిరీ ఇప్పటివరకూ కల్తీ పాల్పడలేదని, ఒక్క కంప్లైట్ కూడా లేదని వెల్లడించింది. నిరంతరం నాణ్యత పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది.ఎప్పుడూ కూడా నాణ్యత లోపాలు బయటపడలేదని చెప్పింది. తాజా నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపామని, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కల్తీ ఉంటే తెలంగాణకు తెలియజేస్తానమి విజయ డెయిరీ రిప్లై ఇచ్చింది.

Next Story