AP News:ఆ నియోజకవర్గాల్లో కాపుల మద్దతు కూటమికే..?

by Disha Web Desk 18 |
AP News:ఆ నియోజకవర్గాల్లో కాపుల మద్దతు కూటమికే..?
X

దిశ,కాకినాడ:పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని కూటమి నాయకులు ప్రకటించారు.అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సమస్యల పై ప్రత్యేకమైన మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం రమణయ్య పేటలో ఉన్న ఇటీవల టీడీపీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి గా నియమితులైన వాసిరెడ్డి ఏసుదాసు ఇంటి వద్ద విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. కాపులకు ఎన్నో పథకాలు వారి అభివృద్ధికి నిధులు కేటాయించిన చంద్రబాబుకే కాపుల మద్దతు ఉంటుందని దాసు చెప్పారు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున టీడీపీ ఆవిర్భవించిందని తద్వారా ఎందరికో రాజకీయాలలో ఉన్నత స్థానం లభించిందన్నారు.

అందరినీ మోసం చేసిన వైసీపీకి, జగన్ అండ్ కంపెనీకి వీడ్కోలు పలకాలని దాసు కోరారు. పార్టీ నాయకుడు నురుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఏకమై ప్రజల్లో సుస్థిర స్థానం కల్పించుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ గెలిపించాలని కోరారు. ప్రస్తుతం తెలుగుదేశం పాలన రాష్ట్రానికి అవసరమని దుష్ట వైసీపీ పాలన వల్ల రాష్ట్రం ప్రగతి పథంలో వెనుకబడి పోయిందన్నారు. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో అందరూ కలిసి సైకిల్, గాజు గ్లాస్ గుర్తులకు అశేషమైనటువంటి ప్రచారం కల్పించాలన్నారు. దీనికి కలిసికట్టుగా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు.

గ్రామీణ స్థాయిలో జనసేన, టీడీపీ బలంగా ఉందని అందుకే బీజేపీ నేతలు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో డ్రగ్స్, మాఫియా, అవినీతి, అరాచకం ప్రభుత్వమైన వైసీపీని ఇంటికి సాగనంపాలని సూచించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో స్థానిక సమస్యలను తెలియజేసే ఒక మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం లో దొంగ పట్టాలు ఇచ్చేందుకు సంబంధిత ప్రజాప్రతినిధి పావులు కుదుపుతున్నారని ఆ పట్టాలు నిజమైనవి కావని, అవి నకిలీ పట్టాలని ప్రజలు గ్రహించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని నానాజీ కోరారు.


Next Story

Most Viewed