ఛాయ్‌వాలాగా మారిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు (వీడియో)

by Disha Web Desk 4 |
ఛాయ్‌వాలాగా మారిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు రాగానే ప్రజాప్రతినిధులంతా గ్రౌండ్‌లో యాక్టివ్ అవుతారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పంచ్ డైలాగ్‌లతో ప్రసంగాలు, ప్రజల్లో భరోసా కల్పించేందుకు మేనిఫెస్టో వివరిస్తారు. అంతే కాకుండా ప్రజల్లో పాపులారిటీ కోసం వినూత్నమైన స్టంట్స్ వేస్తారు. ఒకరు పిల్లాడికి స్నానం చేయిస్తే.. మరొకరు బండిపై దోశ వేస్తారు. ఎడ్లబండిపై ప్రచారం నిర్వహిస్తారు. కుట్టుమిషన్‌పై కూర్చొని కుట్టేస్తారు. ఇక, తాజాగా బుధవారం ఏపీ మంత్రి అంబటి రాంబాబు చాయ్ వాలా అవతారం ఎత్తారు. ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలపై తనదైన స్టైల్‌లో సెటైర్లు, పంచ్‌లు వేసే అంబటి చాయ్ కలుపుతూ సందడి చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇలాంటి సన్నివేశాలు త్వరలో మరికొన్ని దర్శనం ఇవ్వనున్నాయి.



Next Story

Most Viewed