- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP High Court: పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట.. ఆ కేసులలో కీలక ఆదేశాలు
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో భారీ ఊరట లభించింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pavan Kalyan), మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియా (Social Media)లో అసభ్యకర పోస్టుల ఆరోపణ నేపథ్యంలో నాలుగు పోలీసుస్టేషన్లలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ.. పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) మంగళవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. విశాఖ (Vishakha)తో పాటు చిత్తూరు (Chittoor) జిల్లాల్లో నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. పాతపట్నం, అనంతపురం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో విచారణను కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
కాగా, పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)పై రాష్ట్ర వ్యాప్తంగా 17పైగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె (Obulavaripalle) పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పోసానిని పోలీసులు ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వే కొడూరు (Railway Kodur) మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలు (Rajampet Sub Jail)కు తరలించారు. అయితే నరసరావుపేట (Narasaraopet) పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజాంపేట సబ్ జైలుకు చేరుకుని పీటీ వారెంట్ (PT Warrant)పై పోసానిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళికి ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు సబ్ జైలుకు తరలించగా.. మంగళవారం ఆదోని (Adoni) పోలీసులు గుంటూరు (Guntur) జైలు నుంచి అదుపులోకి తీసుకుని కర్నూలుకు తీసుకెళ్లారు. కర్నూలు (Kurnool) జడ్జి ఎదుట పోసానిని పోలీసులు హాజరుపరచగా పోసానికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం పోసాని మురళికృష్ణ కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు.






