- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను ట్రోల్ చేస్తున్నారు..ఏపీ హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
నన్ను రెండు రోజులుగా ట్రోల్ చేస్తున్నారు..సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ ఏపీ హైకోర్టు జస్టిస్ కే. శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో బెంచ్ మీదనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నన్ను రెండు రోజులుగా ట్రోల్ చేస్తున్నారు..సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ ఏపీ హైకోర్టు జస్టిస్ కే. శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో బెంచ్ మీదనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వారం సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్‌ను అనుమతించిన వ్యవహారంలో సింగయ్యపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఈ రోజు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నింధితులకు బెయిల్ ఇచ్చే క్రమంలో ట్రోలింగ్ పై స్పందించారు. తనను రెండు రోజులుగా ట్రోల్ చేస్తున్నారని, ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నింధితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోలింగ్‌కు పనికివస్తాయని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, తోపుదర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. తన ముందు ఉన్న అన్ని బెయిల్ కేసులు వచ్చే వారం బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం న్యాయమూర్తి చేసిన కామెంట్లు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.






