Madurai: పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం.. శాలువా కప్పి సత్కారం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-22 14:00:16  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తమిళనాడు రాష్ట్రం మధురైలో బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు.

Madurai: పవన్ కల్యాణ్‌కు ఘన  స్వాగతం.. శాలువా కప్పి సత్కారం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)ను తమిళనాడు రాష్ట్రం మధురై(Madurai)లో బీజేపీ(Bjp) నేతలు ఘనంగా సత్కరించారు. మురుగ భక్తర్గళ్ మానాడు(Muruga Bhakthargal Manadu)లో పాల్గొనేందుకు ఏపీ(Ap) నుంచి ఆయన వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను మధురైలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ గవర్నర్ తమిళిసై, పొంగులేటి సుధాకర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం మురుగ భక్తర్గల్ మానాడు సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అంతకుముందు తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు శాలువ కప్పి ఆయన సైతం ఆహ్వానం పలికారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పవన్ కల్యాణ్‌ను దర్శించుకున్నారు.

Next Story