పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘హరిహరవీరమల్లు‘ ప్రీ లిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-02 17:24:25  IST  )

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహరవీరమల్లు’ సినిమా ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది....

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘హరిహరవీరమల్లు‘  ప్రీ లిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరిహరవీరమల్లు’(Harihara Veeramallu) సినిమా ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre release event) జరుపుకోనుంది. ఇందుకు తిరుపతి(Tirupati) వేదిక కానుంది. ఎస్వీ యూనివర్సిటీ తారకరామ గ్రౌండ్‌(SV University Tarakarama Ground)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మూవీ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ డైరెక్ట్‌గా చూడొచ్చని చెబుతున్నారు. ఇక ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని, భారీగా కలెక్షన్లు వస్తాయని, గత రికార్డులను తిరగరాస్తుందని చిత్ర యూనిట్ దీమాగా చెబుతోంది.

Next Story